
సీక్వెల్స్ ఎలా ఉండాలి.? ఆల్రెడీ చెప్పిన కథని కంటిన్యూ చేస్తే సరిపోతుందా.? లేకుంటే థీమ్ మాత్రం తీసుకుని కథలో కొత్తదనాన్ని క్రియేట్ చేసుకోవాలా? వీటన్నిటికీ మించి మరో విషయం ఉంది. అదే కమర్షియల్ సక్సెస్. ఏం చేసినా బొమ్మ బాక్సాఫీస్ దగ్గర దద్దరిల్లాలి. కాసుల వర్షం కురిపించాలి.

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ టిల్లు స్క్వేర్ విషయంలో అదే జరిగింది. మరి టీజర్‌తోనే టిల్లు వైబ్స్ ని గుర్తు చేసిన డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి ఏంటి? డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఎలా ఉంది అనే డిస్కషన్‌లో రిపీటెడ్‌గా వినిపిస్తున్న మాట ఒకటే.

ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్‌లోనే ఉంది అనేది. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌లో థీమ్, డైలాగులు, బ్యాక్‌డ్రాప్, ఈశ్వరుడి ప్రస్తావన... ఇలా ప్రతిదీ ఫస్ట్ పార్టుని గుర్తుచేస్తోంది.

చిన్న సినిమాలైనా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటాయా అంటే అది కూడా జరగలేదు. నోటబుల్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా నవ్విస్తూనే సాగింది టిల్లు స్క్వేర్. ఇంచ్ బై ఇంచ్ యూత్‌ని అట్రాక్ట్ చేయడంలో క్లిక్ అయింది కాబట్టే కాసుల వర్షం కురిసింది టిల్లు స్క్వేర్ సినిమాకి. సీక్వెల్ ఇచ్చిన జోష్‌తో త్రీక్వెల్‌కి ప్రిపేర్ అవుతున్నారు మేకర్స్.

టిల్లు విషయంలో కలిసొచ్చిన అంశం డబుల్ ఇస్మార్ట్ విషయంలోనూ రిపీట్ అవుతుందా? అనే డిస్కషన్ జరుగుతోంది. అదే జరిగితే చాన్నాళ్లుగా మంచి హిట్ కోసం వెయిట్ చేసిన రామ్ అండ్ పూరి ఫుల్ ఖుషీ కావడం ఖాయం.