కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామ. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్ధమవుతుంది. సత్యభామ హ్యాండిల్ చేస్తున్న కేసులో అనుకోకుండా ఒక వ్యక్తి మరణించడం, ఆ కేసు నుంచి ఆమెను తొలిగించడం, కానీ తన వల్ల ఒక తప్పు జరిగిందన్న కోపంతో సత్యభామ.. ఆ కేసుని ఆఫ్ డ్యూటీలో ఇన్‌వెస్టిగేషన్ చేయడం సినిమా కథ అని తెలుస్తుంది.
Jailer Hukumసంక్రాంతి పండక్కి తెలుగులోనే చాలా సినిమాలు వస్తున్నాయి. వాటితో పాటు తమిళనాట పొంగల్ రిలీజ్‌లు బాగానే ఉన్నాయి. అందులో ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఉంది. దాంతో పాటు శివ కార్తికేయన్ అయలాన్ సినిమా కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఇదే పండక్కి రజినీకాంత్ లాల్ సలామ్ కూడా వస్తుంది. ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య దర్శకురాలు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వరుస ఫ్లాపులు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కంగనాకు బాక్సాఫీస్ వద్ద మరో ఎదురుదెబ్బ తగిలింది. కంగన నటించిన తాజా రిలీజ్ తేజస్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ. 4.25 కోట్లు రాబట్టింది. అంటే నికరంగా 50 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్. ఈ చిత్రం దాదాపు 600 కోట్లు వసూలు చేసింది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హుకుం పాటకు ఏకంగా 100 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి.
సూపర్ స్టార్ పేరు వినగానే సినీ పరిశ్రమలో అందరికీ గుర్తు వచ్చే పేరు కృష్ణ. టాలీవుడ్‌లో ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తీసి, ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచారు. ఆయన విగ్రహాన్ని కమల్ హాసన్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన గురించి మాట్లాడారు కమల్ హాసన్.