
నా థాట్ వేరు... నా సినిమా వేరూ అంటూ చాలా స్పెషల్‌గా రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు కెప్టెన్ సందీప్ రెడ్డి వంగా. ఎవరెన్ని అన్నా.. ఏం అన్నా.. తాను నమ్మిన విషయాన్ని పక్కాగా అమలు చేసుకుంటున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ప్రభాస్‌కి కూడా కండిషన్స్ అప్లై అంటున్నారట సందీప్.

రీసెంట్‌గా కల్కి సక్సెస్ చూసిన ప్రభాస్‌కి ఇప్పుడు సెట్స్ మీద రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి రాజా సాబ్. రెండు ఫౌజీ. రాజా సాబ్ ఈ ఏడాది రిలీజ్ అయినా, ఫౌజీని నెక్స్ట్ ఇయర్‌కి షిఫ్ట్ చేసే అవకాశాలున్నాయి. అంతలో సలార్ సినిమా ముందుకొస్తే?

సలార్ ముందుకొచ్చినా, కల్కి సీక్వెల్ ముందుకొచ్చినా... స్పిరిట్ వెనక్కి వెళ్లే ప్రమాదం గట్టిగా కనిపిస్తోంది. దానికి రీజన్ కూడా సందీప్ రెడ్డి వంగా. నా సినిమా చేస్తున్నప్పుడు మరే సినిమాలో నటించకూడదు, నా మూవీ లుక్ బయటకు లీక్ కావడానికి వీల్లేదు.

అందుకే మిగిలిన సినిమాలన్నిటినీ కంప్లీట్ చేశాకే, నా సినిమాకు రండి అని స్ట్రాంగ్ గానే చెప్పేస్తున్నారట. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్.. సందీప్ సినిమా షూటింగ్‌కి వెళ్తే రాజా సాబ్, ఫౌజీ ప్రమోషన్లకు హాజరు కావడం కుదరదు.

అలాగని రాకుండా ఉంటారా? లేకుంటే గెటప్‌ని ఏదో రకంగా మేనేజ్ చేస్తారా? అసలు స్పిరిట్‌ని ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రెబల్ సైన్యం ఆన్సర్ ప్లీజ్ అని అడుగుతున్న ప్రశ్నలివి.