Phani CH | Edited By: Ravi Kiran
Sep 09, 2021 | 5:57 PM
స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాషన్ ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. యోగా, జిమ్ సెషన్స్ మొదలుకొని.. తన హాలీడే ట్రిప్స్ వరకూ ప్రతీది ఫోటోల రూపంలో ఫ్యాన్స్‌తో పంచుకుంటారు.
కొద్దిరోజుల క్రితం గోవా టూర్‌కు వెళ్లిన సమంత.. అక్కడి విశేషాలను తెలియజేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే పలు బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తోన్న సమంత.. అందుకు సంబంధించిన ఫోటోషూట్స్‌ను తరచూ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేస్తారు.
ఆమె తాజాగా రెండు ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేశారు. అందులో ఒకటి ప్రముఖ డిజైనర్ నీతా లుల్లాది కాగా.. మరొకటి లూయిస్ విట్టన్ బ్రాండ్ ఉత్పత్తులది.
ఈ రెండింటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా లూయిస్ విట్టన్ యాడ్ షూట్‌లో సమంత ఒకవైపు అందాలు.. మరివైపు ఆబ్స్‌ని ప్రదర్శిస్తూ ఫోటోషూట్ చేశారు.
అవి అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పుడప్పుడు తన అభిమాన హీరోయిన్ ఇలా సర్‌ప్రైజ్‌లు ఇస్తుండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సమంత సమాజ సేవను కూడా చేస్తుంటారు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అనాధలకు అండగా నిలవడమే కాకుండా ఎందరికో చేయూతను అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆసుపత్రులతో కలిసి వైద్యం చేయిన్చుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.