
చూశారుగా... అన్ని పిక్స్ ఉన్నా సరే, రాజ్ నిడిమోరు ఉన్న ఫొటోల గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే మాటలకు ఈ పిక్స్ మరింత ఆజ్యం పోసాయని చెవులు కొరుక్కుంటున్నారు.

అంతా ఫ్యామిలీమేన్‌లో నటించినప్పటి నుంచే అనే గుసగుసలు మొదలయ్యాయి. ఫ్యామిలీమేన్ సమయంలో రాజ్‌తో సమంతకు సాన్నిహిత్యం ఏర్పడిందనే మాటలు ఎప్పటి నుంచో ఉన్నా, సిటాడెల్‌కి అవి స్ట్రాంగ్‌గా వినిపించసాగాయి.

సమంత అనారోగ్యంతో బాధపడ్డప్పుడు రాజ్ సపోర్ట్ చేశారన్న టాక్ కూడా విపరీతంగా స్ప్రెడ్ అయింది. అయితే సమంత పికిల్ బాల్ టీమ్‌ని తీసుకున్నప్పుడు వెంటుండి నడిపించారు రాజ్.

ఒకానొక సందర్బంలో వారిద్దరూ చేతులు పట్టుకున్న పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా సామ్ తిరుపతి విజిట్ చేసినప్పుడు కూడా వెంటే ఉన్నారు రాజ్. సామ్ ప్రొడ్యూసర్‌గా మారిన శుభం సినిమాకు కూడా పనిచేశారు మిస్టర్ నిడిమోరు.

న్యూ బిగినింగ్స్ అంటూ ట్రాలాలా సంస్థ గురించి సామ్ పోస్టు పెట్టారా? లేకుంటే రాజ్‌తో ఉన్న బంధాన్ని నిగూఢంగా చెప్పారా? అనే మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే, తమ మధ్య రిలేషన్‌షిప్ గురించి సామ్‌గానీ, రాజ్‌గానీ ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పకపోవడం గమనార్హం.