
అప్పుడే బాలీవుడ్‌లో మరింత బజ్, ఫేమ్ వస్తుందన్న విషయం సామ్‌కి బాగా తెలుసు. అందుకే, సిటాడెల్ విషయంలో ఎక్కడా రాజీపడదలచుకోలేదు ఈ బ్యూటీ.

దీంతో కొన్నిరోజులుగా ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రస్తుతం సామ్ ముంబైలో ఉంటుంది. అలాగే ఇన్ స్టాలోనూ అందరితో ముచ్చటిస్తూ సిరీస్ పై ఆసక్తిని కలిగిస్తోంది సామ్.

తాజాగా ముంబైలో ప్రదర్శించిన సిటాడెల్ ప్రీమియర్ షో వేడుకకు మెటాలిక్ గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి హాజరయ్యింది సామ్. ఈ కార్యక్రమంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందరి దృష్టిని ఆకర్షించింది.

సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని తనదైన శైలిలో సందడి చేసింది సామ్. ప్రీమియర్ షోకు వచ్చిన సెలబ్రెటీలతో ముచ్చటించింది సామ్. అంతకు ముందు క్రేజీ డ్రెస్ లో వేరెలెవల్ లో ఫోజులు ఇచ్చింది.

ప్రస్తుతం సమంత ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పిక్స్ అదిరిపోయాయని.. సామ్ డ్రెస్సింగ్ సెన్స్ వేరెలెవల్లో ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సమంత తెలుగులో ఏ సినిమాను ప్రకటించలేదు.