
సమంత 28 ఏప్రిల్ 1987న జన్మించింది. చిన్న వయసులోనే మోడలింగ్‌లో కెరీర్‌ను ఆరంభించింది. హోలి ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది.

గౌతమ్ వాసుదేవ మేనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’తో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఏ మాయ చేసావే’ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్‌ఫేర్, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందుకుంది.

‘అ ఆ’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ , ఐఫా ఉత్సవం అవార్డులను గెలుచుకుంది. అత్తారింటికి దారేది చిత్రానికి ఉత్తమ నటిగా, మనం, రంగస్థలం చిత్రాలకు ఉత్తమ నటిగా సైమా అవార్డులను గెలుపొందింది.

ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్ధను స్థాపించింది. ఈ సంస్థ మహిళలు, బాలలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి వైద్య సదుపాయాలను అందిస్తుంది.

ప్రస్తుతం కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృడంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలని దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలమని తెలిపింది.

సమంత అక్కినేని..