
తెలుగు తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత. వరుసగా రెండు భాషల్లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ నెంబర్ వన్ రేస్ లో ఉంది ఈ బ్యూటీ .

వివాహమైన తరువాత సమంత గ్లామర్ ప్రధానమైన పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది.

ప్రస్తుతం సమంత 'శాకుంతలం' అనే సినిమా చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది.

తెలుగు-తమిళ్ భాషల్లో ఎంత క్రేజ్ వచ్చినప్పటికీ సమంత బాలీవుడ్ వైపు వెళ్లలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు.

కానీ ఇప్పుడు హిందీలో 'ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వివాదాల వలయంలో చిక్కుకుంది.

ఇంతవరకు హిందీ సినిమాలు ఎందుకు చేయలేదు.? అన్న ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ.."భయం వల్లనే చేయలేదు .. అక్కడ నెగ్గుకు రావాలంటే మరింత ప్రతిభ అవసరం అనిపించింది" అని చెప్పుకొచ్చింది.