
ఏప్రిల్ 28వ తేదీ 1987లో సంవత్సరంలో జన్మించింది సమంత అక్కినేని. 2010లో ఏమాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది.

తెలుగు-తమిళ్ భాషల్లో ఎంత క్రేజ్ వచ్చినప్పటికీ సమంత బాలీవుడ్ వైపు వెళ్లలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు.

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ పరిశ్రమలో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం సమంత 'శాకుంతలం' అనే సినిమా చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది.

వివాహమైన తరువాత సమంత గ్లామర్ ప్రధానమైన పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది.

ఇవే కాకుండా.. సమంత ప్రస్తుతం వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. 'సాకీ' పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.

అలాగే తన స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో పాటు ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో కలిసి 'ఏకం' లెర్నింగ్ సెంటర్‌ని స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సమంత. ఈరోజు ఈ అక్కినేని వారి కోడలు 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది.