
తొలి చిత్రంతోనే కోట్లాది మంది అభిమాను హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రింకు రాజ్ గురు. ఈ పేరు చెబితే మీకు అంతగా గుర్తుపట్టలేరు కావచ్చు. కానీ.. సైరత్ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది రింకు.

2016లో మరాఠీలో విడుదలైన సైరత్ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ అందమైన ఎమోషనల్ ప్రేమకథ అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ చిత్రంలో అర్చీ పాత్రలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రింకు రాజ్ గురు. ఇందులో ఆమె యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.

రింకు రాజ్‌గురు సైరత్ తన తొలి సినిమాతోనే ఫేమస్ అయ్యింది. అందులో ఆమె స్వాగ్, బలమైన నటనతో కట్టిపడేసింది.ఈ చిత్రం తర్వాత మరాఠీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేసి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆమెకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రింకు రాజ్ గురు తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందుకే నటనపై ఆసక్తి ఉన్న రింకుకు చిన్నప్పటి నుంచి చదువుపై ఫోకస్ పెట్టాలని తెలిపారు.. ఆమె 2016లో 'సైరత్' చిత్రంలో అరంగేట్రం చేసింది. జూన్ 3, 2001న షోలాపూర్ సమీపంలోని అక్లుజ్ గ్రామంలో జన్మించిన రింకు ఇప్పుడు మరాఠీతో పాటు హిందీలోనూ నటనలో తనదైన ముద్ర వేస్తోంది.

ఈరోజు రింకు రాజ్ గురు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. రింకు రాజ్ గురు వయసు 24 సంవత్సరాలు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చదువుతోంది. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉండే రింకు నిత్యం తన క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.