
టాలీవుడ్ లో పాగావేసిన టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు.

ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ చిన్నది.

సాయిపల్లవికి ప్రతి సినిమాలోను ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉండటం .. ఆ సాంగ్ ఆ సినిమాకి హైలైట్ గా నిలవడం తెలిసిందే.

ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.

శ్యామ్ సింగరాయ్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందట ఈ ఫిదా బ్యూటీ.

ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేకమైన సాంగ్ 'శ్యామ్ సింగ రాయ్'లోను ఉందట.

క్లాసికల్ డాన్స్ టచ్ తో సాగే ఈ పాటలో సాయిపల్లవి డాన్స్ నెక్స్ట్ లెవల్ అంటున్నారు