సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. న్యాచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు సినీప్రియులకు లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.
ఫిదా సినిమాతో తెలుగు అడియన్స్ మనసు దొచుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ, గార్గి, విరాటపర్వం చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి.
గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది సాయి పల్లవి.
గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది సాయి పల్లవి.
చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించి సాయి పల్లవి.. చాలా కాలం బ్రేక్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన నటిస్తోంది.
అయితే సాయిపల్లవి సినిమాల్లో మేకప్ తక్కువగా వేసుకుంటుంది. ఇక మరికొన్ని సినిమాల్లో అసలు మేకప్ వేసుకోదు. అయిన సహజ సౌందర్యం ఆమె సొంతం. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది.
తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు తీసుకుంటుందట. కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అస్సలు ఉపయోగించనని.. కనీసం మూడు రోజులైన ఎక్సర్ సైజ్ చేస్తానంటుంది.
అలాగే రోజూ తగినన్ని మంచినీల్లు మాత్రం తాగుతానని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.