
ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో తలదూర్చని సాయి పల్లవి ఫస్ట్ టైమ్ ట్రోలర్స్‌కు దొరికిపోయారు. గతంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలకు ఇబ్బందిగా మారాయి. ఏకంగా నేషనల్ లెవల్‌లో బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇంత రచ్చకు కారణమైన ఆ కామెంట్స్ ఏంటి..?

విరాటపర్వం సినిమాలో నక్సలైట్‌తో ప్రేమలో పడే పాత్రలో నటించిన సాయి పల్లవి, ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా హింస గురించి మాట్లాడారు. ఆ కామెంట్సే ఇప్పుడు ఇంత రచ్చకు కారణమయ్యాయి.

'పాకిస్తాన్ ప్రజలకు మన ఆర్మీ టెర్రరిస్ట్‌లలా కనిపిస్తుంది. మనకు వాళ్ల ఆర్మీ అలా కనిపిస్తుంది. ఇక్కడ చూసే విధానం వల్ల అంతా మారిపోతుంది. అందులో ఎవరు రైట్, ఎవరు తప్పు అనేది చెప్పలేం' అన్నారు.

ఈ కామెంట్సే ఇప్పుడు సాయి పల్లవిని చిక్కుల్లో పడేశాయి. అమరన్ ప్రమోషన్స్‌కు ముందు నుంచే కొంత మంది నెటిజెన్స్ సాయి పల్లవిని టార్గెట్ చేశారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ బ్యూటీ నేషనల్ వార్ మెమోరియల్‌లో నివాళి అర్పించినా... నెటిజెన్స్ మాత్రం ఈ బ్యూటీని క్షమించలేదు.

ప్రజెంట్ బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. మరి ఈ ట్రెండ్స్ అమరన్‌కు ప్లస్ అవుతాయా? మైనెస్ అవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.