
12 అక్టోబర్ 1993న లండన్‌లో పంజాబీ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రుక్సార్ ధిల్లాన్. యూకేలో పుట్టినప్పటికీ గోవాలో పెరిగింది. ఈ ముద్దుగుమ్మ కుటుంబం ఇప్పుడు కర్ణాటకలోని బెంగళూరులో స్థిరపడింది.

ఇండియాలోనే ఓ ప్రముఖ కళాశాల నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పట్ట పొందింది అందాల తార రుక్సార్ ధిల్లాన్. 2016లో రన్ ఆంటోనీతో సినీరంగ ప్రవేశం చేసింది. 2017లో ఆకతాయి అనే సినిమాతో తెలుగు చలనచిత్రం అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధంలో హీరోయిన్గా తన నటనతో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ అనే సినిమాలో చేసింది. ఇది ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఇందులో రుక్సార్ ధిల్లన్ సెకండ్ హీరోయిన్. స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ అనే సినిమాలో కనిపించింది. 2024లో నా సామిరంగా సినిమాల్లో నటించింది రుక్సార్ ధిల్లన్.

2022 నుంచి లయన్స్‌గేట్ ఇండియాలో ప్రసారం అవుతున్న జుగాదిస్తాన్ అనే బాలీవుడ్ కామెడీ డ్రామా వెబ్‌సిరీస్‌లో తొలిసారి హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో కథానాయకిగా రాణిస్తుంది ఈ వయ్యారి.