
రుక్మిణి వసంత్..ఇప్పుడు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కన్నడ భామ.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది.

తాజాగా ఈ అమ్మడు నటించిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో అందం, అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది రుక్మిణి.

ఇందులో యువరాణి పాత్రలో తన నటనతో కట్టిపడేసింది. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. కాంతార చాప్టర్ 1 సినిమాతో ఈ అమ్మడ పేరు మారుమోగుతుంది. ఇటీవలే శివకార్తికేయన్ సరసన మదరాసి చిత్రంలో నటించింది రుక్మిణి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో ఈ అమ్మడు నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ భారీగానే పారితోషికం తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకుందని సమాచారం. అలాగే రిషబ్ శెట్టి ఎలాంటి పారితోషికం తీసుకోలేదని టాక్. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.