- Telugu News Photo Gallery Cinema photos RRR Star Ram Charan Spotted In Black Attire, Barefoot As He Observes 41 Day Long Ayyappa Deeksha
Ram Charan: తండ్రి బాటలోనే తనయుడు.. అయ్యప్ప మండల దీక్ష తీసుకున్న చెర్రీ
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఉగాది పర్వదినం రోజున తన తల్లిదండ్రులకు పూజ అనంతరం కళ్ళకు నమస్కారం చేసినప్పుడే రామ్ చరణ్ అయ్యప్ప మాలను ధరించినట్లు తెలుస్తోంది. తాజాగా రామ్ చరణ్ చెప్పులు లేకుండా ముంబైకి చేరుకున్న పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి.
Updated on: Apr 04, 2022 | 1:26 PM

అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ నలుపు రంగు దుస్తులను ధరించారు. ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెర్రీ.. సీతారామరాజుగా తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు

హిందూ మతాచారం ప్రకారం అయ్యప్ప మండల దీక్షను తీసుకుంటారు. నియనిష్ఠలతో 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షను పూర్తి చేస్తారు. నలుపు రంగు దుస్తులు ధరించడం, చెప్పు లేకుండా నడవడం, ఒంటి పూట భిక్షను స్వీకరించడం సాయంత్రం పడి, బ్రహ్మచర్యం వంటి నియమాలను తప్పనిసరిగా తీసుకుంటారు.

కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు స్వామి అయ్యప్ప భక్తులు అయ్యప్ప దీక్ష చేపడతారు.

ఈ 41 రోజులు ఉపవాసం ఉంటారు. ఆయప్ప దీక్షను తీసుకున్న చరణ్.. ఆ నియమాలను తప్పకుండా పాటిస్తారు.

అయితే ఇలా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఇదే మొదటి సారి కాదు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బాటలోనే అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నాడు. చిరంజీవి కూడా అయ్యప్ప ను దర్శించుకునే ముందు దీక్ష తీసుకునేవారన్న సంగతి తెలిసిందే




