Roja Selvamani: అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు.. అన్షు ఏం కావాలనుకుంటుందో తెలుసా? ఫొటోస్

Updated on: Apr 28, 2026 | 8:11 PM

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక సెల్వమణి అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ చివరి రోజులు అంటూ తన ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫొటోలను అన్షు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 6
సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉంటోన్న ఈ స్టార్ కిడ్ ఇప్పుడు తన కెరీర్ లో మరో ముందడుగు వేసింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది

2 / 6
 అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది అన్షు. అంతేకాదు ఆ యూనివర్సిటీ నుంచి ఏటా ఒక స్టూడెంట్ కు  మాత్రమే అందించే ‘హెర్మన్ బి వెల్స్’ (2026) అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు యూనివర్సిటీ నుంచి పలు అవార్డులు, స్కాలర్‌ షిప్స్ కూడా అందుకుంది.

3 / 6
 కాగా అన్షు మాలిక గ్రాడ్యుయేషన్ సెర్మనీలో రోజా, సెల్వమణి కూడా పాల్గొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ చివరి రోజులు అంటూ తన ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫోటోలను అన్షు మాలిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

4 / 6
 వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రోజా కూతురికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇండిచాపా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు  కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి అంశాలతో పాటు 'ఆర్ట్ ఫర్ ఎ కాజ్' ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంది రోజా కూతురు

5 / 6
 ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డుకు ఎంపికైంది అన్షు. ఈ అవార్డు అందుకున్న వారి పేర్లఇండియానా మెమోరియల్ యూనియన్‌లో శాశ్వతంగా ప్రదర్శించబడుతుంది. యూనివర్సిటీ తరఫున ఏటా ఒక విద్యార్థిని మాత్రమే ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

6 / 6
 కాగా అన్షు రైటర్ గా కూడా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే పలు పుస్తకాలు కూడా రాసింది. అలాగే అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ లు కూడా చేసింది.  కాగా కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అన్షు గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది.

Follow Us