
అందాల తార రీతూ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. బ్లా్క్ కలర్ పూల చీరలో అందమే అద్భుతమైందేమో అన్నట్లుగా కనిపిస్తుంది. చూపులతో మతిపోగొట్టేస్తోనే.. సింపుల్ అండ్ క్యూట్ లుక్స్ తో మంత్రముగ్దులను చేస్తుంది.

ప్రస్తుతం రీతూవర్మ బ్యూటీఫుల్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రీతూ వర్మ చివరిసారిగా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో కనిపించింది. తెలుగులో ఈ హైదరాబాద్ అమ్మాయికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

1990 మార్చి 10న హైదరాబాద్ లో జన్మించిన రీతూ వర్మ.. కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ చేసింది రీతూ వర్మ. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన నటనపై ఆసక్తితో సినిమాలవైపు అడుగులు వేసింది. ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్ కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు.

ఆ తర్వాత 2016లో పెళ్లి చూపులు సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది రీతూ వర్మ. ఆ తర్వాత తెలుగులో కొన్ని ఆఫర్స్ మాత్రమే వచ్చాయి.

ఎవడే సుబ్రహ్మణ్యం, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, ఒకే ఒక జీవితం వంటి చిత్రాల్లో నటించింది. అయితే అందం, అభినయం ఎంత ఉన్నా.. ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసిరాలేదు. దీంతో అనుకున్నంతగా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.

పూల చీరలో జాబిలమ్మ.. నేలకు వాలిందోయ్ ఈ వెన్నెలమ్మ..