Varalakshmi Vratham: వరలక్ష్మి వ్రతం వేడుకల్లో ‘కాంతారా’ హీరో.. భార్య, పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోస్‌

|

Aug 28, 2023 | 5:21 PM

కాంతారా హీరో రిషబ్‌ శెట్టి ఇంట్లో వరమహాలక్ష్మి పండగను అత్యంత ఘనంగా జరుపుకొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిషబ్‌ శెట్టి అతని సతీమణి ప్రగతి శెట్టి, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 5
త శుక్రవారం (ఆగస్టు 25)  వరమహాలక్ష్మి పండుగను అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ పండుగ పూట ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2 / 5
 కాంతారా హీరో రిషబ్‌ శెట్టి ఇంట్లో వరమహాలక్ష్మి పండగను అత్యంత ఘనంగా జరుపుకొన్నారు.  భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిషబ్‌ శెట్టి అతని సతీమణి ప్రగతి శెట్టి, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.

3 / 5
 'గత శుక్రవారం నాడు వరమహాలక్ష్మి పండుగ జరుపుకున్నఆనంద క్షణాలు. ఆ తల్లి అందరికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక' అని ప్రగతిశెట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఇంట్లో వేడుకకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది.

4 / 5
రిషబ్‌ శెట్టి ఇంట్లో వరమహాలక్ష్మి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా కుమారుడు  రన్విత్ శెట్టి, కూతురు రాధ ఫొటోస్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

5 / 5
రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కాంతారా' 2022లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు  రిషబే దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌ను రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ అండ్‌ యాక్టర్‌.