Ravi Teja: రవితేజ ఫిక్స్.. ఇక దానిపైనే ఫుల్ ఫోకస్

| Edited By: Phani CH

Apr 06, 2024 | 3:38 PM

రవితేజ పనైపోయిందిరా.. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులిస్తాడు.. రెమ్యునరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు..! ఇవే బయట కామన్‌గా మాస్ రాజాపై వచ్చే కామెంట్స్. అందులో నిజం లేదని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు రవితేజ. మరి దానికోసం మాస్ రాజా ఏం చేస్తున్నారు..? ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. కొన్నేళ్లుగా రవితేజ వరస విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ.. నిజం చెప్పాలంటే అసలు లేవనే చెప్పాలి. చివరగా 2010లో డాన్ శీను, 2011లో మిరపకాయ్‌తో వరసగా రెండు హిట్స్ ఇచ్చారు రవితేజ.

1 / 5
రవితేజ పనైపోయిందిరా.. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులిస్తాడు.. రెమ్యునరేషన్ బాగా ఇస్తే కథ కూడా పట్టించుకోడు..! ఇవే బయట కామన్‌గా మాస్ రాజాపై వచ్చే కామెంట్స్. అందులో నిజం లేదని నిరూపించుకునే పనిలో బిజీ అయ్యారు రవితేజ. మరి దానికోసం మాస్ రాజా ఏం చేస్తున్నారు..? ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

2 / 5
కొన్నేళ్లుగా రవితేజ వరస విజయాలు అందుకున్న సందర్భాలు తక్కువ.. నిజం చెప్పాలంటే అసలు లేవనే చెప్పాలి. చివరగా 2010లో డాన్ శీను, 2011లో మిరపకాయ్‌తో వరసగా రెండు హిట్స్ ఇచ్చారు రవితేజ. దానికంటే ముందు దుబాయ్ శీను, కృష్ణ.. 2001-02 టైమ్‌లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్ లాంటి వరస హిట్స్ ఇచ్చారు మాస్ రాజా.

3 / 5
గత పదేళ్ళుగా ఒక్క హిట్ ఇస్తే.. రెండు మూడు ఫ్లాపులిస్తున్నారు రవితేజ. ఈ మధ్య మాస్ రాజా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు చూసాక.. కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు ఒప్పుకుంటున్నారా ఏంటి అనే విమర్శలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి. మూడేళ్ళ కింద క్రాక్‌తో  బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు.

4 / 5
రవితేజ అంతే.. ఇక మారడు.. పనైపోయిందనుకుంటున్న తరుణంలో ధమాకాతో 100 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. రొటీన్ కంటెంట్‌తోనే వచ్చినా.. మాస్ రాజా ఇమేజ్ బాగా యూజ్ అయింది. ఇక వాల్తేరు వీరయ్య విజయంలో బ్యాక్ బోన్‌లా నిలిచారు రవితేజ. కానీ ఆ వెంటనే మళ్లీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చారు.

5 / 5
ప్రయోగాలు తనకు వర్కవుట్ కావని.. మళ్లీ మాస్ కంటెంట్‌పై ఫోకస్ చేసారు రవితేజ. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ అంటూ పక్కా కమర్షియల్ సబ్జెక్ట్‌తో వస్తున్నారు. ఆ తర్వాత జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక తనకు హ్యాట్రిక్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితోనూ సినిమా చేయనున్నారు రవితేజ. ఇవన్నీ వర్కవుట్ అయితే దెబ్బకు మాస్ రాజా మార్కెట్ గాడిన పడటం ఖాయం.