Rajeev Rayala |
May 03, 2022 | 7:30 AM
కన్నడలో స్టార్ డమ్ వచ్చిన తరువాతనే 'ఛలో ' అంటూ టాలీవుడ్ వచ్చేసింది అందాల భామ రష్మిక మందన్న. అప్పటి నుంచి అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్.
టాలీవుడ్లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా రష్మిక ఇప్పుడు దూసుకుపోతోంది.
తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది ఈ వయ్యారి భామ
రష్మిక చేసిన బాలీవుడ్ మూవీ ఒక్కటి కూడా ఇంతవరకూ విడుదల కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ సుందరికీ ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది .
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హిట్ చూసిన రష్మిక 'పుష్ప 2' సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది.
కొరటాల - ఎన్టీఆర్, గౌతమ్ తిన్ననూరి - చరణ్, నాగచైతన్య - పరశురామ్ కాంబినేషన్ సినిమాలలో ఆమె చేయానున్నట్టు టాక్