
ఫుల్ మేకప్, ట్రెండీ అటైర్స్ తో పర్ఫెక్ట్ గా పోజులిచ్చిన ఫొటోలకు వచ్చే లైకులు ఎన్ని? వాటి వల్ల పెరిగే ఫాలోయర్ల సంఖ్య ఎంత? ఆ మాటలన్నీ పక్కనపెడితే మన సిల్వర్ స్క్రీన్ గీత... అదేనండీ రష్మిక... లేటెస్ట్ గా చెప్పిన ఓ పాయింట్ మాత్రం జెన్యూన్‌గా అనిపిస్తోంది.

ఆల్వేస్ బ్యూటీఫుల్, గార్జియస్ ఫొటోలు మాత్రమే కాదు. అప్పుడప్పుడూ నవ్వు తెప్పించే ఫొటోలు కూడా పోస్ట్ చేయాలి. ఇదిగో ఇలాంటి ఫోటోలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు కూర్గ్ బ్యూటీ.

చూశారుగా... అదన్నమాట సంగతి. ఈ ఫోజులో తనని చూసి ఎవరైనా గనుక ఇష్టపడితే ఇక ఆ బాండింగ్‌ని బ్రేక్ చేసే వాళ్లు ఎవరూ లేరన్నది రష్మిక పాయింట్.

గట్టిగా ఆలోచిస్తే ఆ మాటలో లాజిక్ ఉందనిపిస్తుంది! అన్ని వేళలా అందమే కాదు, కొన్నిసార్లు నేచురాలిటీని కూడా ఇష్టపడాలి. ఆ మాటకొస్తే ఎదుటివారిని యాజ్ ఇట్ ఈజ్‌గా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే ఆ బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.