Rashmika Mandanna: శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫ్రెండ్స్‌తో కలిసి జాలీ జాలీగా .. ఫొటోస్ వైరల్

Edited By:

Updated on: Dec 18, 2025 | 11:08 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం శ్రీలంక వెకేషన్ లో ఉంది. తన స్నేహితురాళ్లతో కలిసిబాగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే వీటిని చూసిన నెటిజన్లు పెళ్లికి ముందు రష్మిక ఇస్తోన్న బ్యాచిలరేట్ పార్టీ ఇదేనని అభిప్రాయపడుతున్నారు.

1 / 6
 పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న సినిమా షూటింగులకు కాస్త బ్రేక్ ఇచ్చింది. చిన్న విరామం తీసుకుని  తన  స్నేహితులతో కలిసి శ్రీలంక వెకేషన్కు వెళ్లింది.

2 / 6
 ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది రష్మిక మందన్నా. బీచ్‌లో సేదతీరడం, స్నేహితులతో సరదాగా గడపడం ఇలాంటి మధుర క్షణాలను ఈ ఫొటోల్లో పంచుకుంది.

3 / 6
 గర్ల్స్ ట్రిప్స్ ఎంత సమయం ఉన్నా చాలా ప్రత్యేకమని, అయితే కొంతమంది స్నేహితులు రాలేకపోయారని కూడా రష్మిక మందన్నా తన పోస్టులో పేర్కొంది.

4 / 6
ప్రస్తుతం రష్మిక మందన్నా శ్రీలంక వెకేషన్ కు సంబంధించిన ఫొటోల నెట్టింట వైరల్ గా మారాయి. కాగా రష్మిక స్నేహితుల లిస్టులో ప్రముఖ హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా ఉండడం గమనార్హం.

5 / 6
 కాగా ఈ ఫొటోలను చూసిన చాలా మంది నెటిజన్లు ఇది పెళ్లికి ముందు రష్మిక మందన్నా ఇస్తోన్న బ్యాచిలరేట్ పార్టీ కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

6 / 6
 కాగా రష్మిక, హీరో విజయ్ దేవరకొండను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని తెలిసింది