
విలక్షణ పాత్రలతోనే కాదు వింత వింత కాస్ట్యూమ్స్‌తోనూ బాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంటారు యంగ్ హీరో రణవీర్ సింగ్. కాస్ట్యూమ్స్ విషయంలో తరుచూ ట్రోలర్స్‌కు దొరికిపోతున్నా... తాను మాత్రం తన పంథాలోనే దూసుకుపోతున్నారు.

అందుకే ప్రతీ ఇంటర్వ్యూలో స్టైలింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు రణవీర్‌కు ఎదురవుతూనే ఉంటాయి. ఆ క్వశ్చన్స్‌కు తనదైన స్టైల్‌లో ఫన్సీ ఆన్సర్స్ ఇస్తుంటారు ఈ యంగ్ హీరో.

స్టైలింగ్ విషయంలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న రణవీర్‌కి నచ్చిన స్టైల్ ఐకాన్ ఎవరు..? ఇలాంటి మసాలా క్వశ్చన్స్‌కు కేరాఫ్ కాఫీ విత్ కరణ్ షో. నయా సీజన్‌ను రణ్‌వీర్, ఆలియాతో స్టార్ట్ చేసిన కరణ్ రణ్‌వీర్‌ను ఫేవరెట్ స్టైల్ ఐకాన్ గురించి క్వశ్చన్ చేశారు.

ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా మోస్ట్ కాంట్రవర్షియల్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ తన ఫేవరెట్ స్టైల్ ఐకాన్ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఉర్ఫీ జావెద్... ఫిలిం సర్కిల్స్‌లో పెద్దగా పాపులర్ కాకపోయినా... గ్లామర్ ఫీల్డ్‌లో మాత్రం ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగే ఉంది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిజైన్స్ ట్రై చేస్తూ ఎప్పుడూ ట్రోలర్స్‌కు కావల్సినంత ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంటారు ఉర్ఫీ.

తన మీద వచ్చే కాంట్రవర్సీల విషయంలో డోంట్ కేర్ అన్నట్టుగా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ ట్రై చేస్తూనే ఉన్నారు.

ఇన్నాళ్లు సోషల్ మీడియా సెగ్మెంట్‌లోనే పాపులర్ అయిన ఉర్ఫీ... రణ్‌వీర్ కామెంట్‌తో సినిమా సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాదు ఇప్పటికే వింత స్టైల్స్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ...

బాలీవుడ్ స్టార్ హీరో స్టేట్మెంట్ తరువాత ఇంకే రేంజ్‌లో గ్లామర్ షో చేస్తారో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.