
చూసిన ప్రతి ఒక్కరూ చెర్రీలో న్యూ డైమన్షన్‌ని బయటపెట్టే మూవీ అని డిసైడ్ అయిపోతున్నారు. పెద్ది లుక్స్ వెరీ ఇంటెన్స్ అని పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

సినిమా లవర్స్ కి పెద్ది మూవీ ఫీస్ట్ లా ఉంటుందన్నది మెగాస్టార్ మాట. రామ్‌చరణ్‌లోని సరికొత్త డైమన్షన్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుందన్నది మెజారిటీ ఒపీనియన్.

వింటేజ్, రెట్రో, పీరియాడిక్... ఏ మాటతో డిస్‌క్రైబ్ చేసినా, రామ్‌చరణ్ లుక్స్ మాత్రం పక్కా మాస్ మసాలా కాన్సెప్ట్ అనే విషయాన్నే డిక్లేర్ చేస్తున్నాయి. చెర్రీతో జాన్వీ నటిస్తున్న సినిమా ఇది.

కొన్ని కీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసింది టీమ్.ఈ ఏడాది గేమ్‌చేంజర్‌తో పలకరించారు రామ్‌చరణ్. ఆ సినిమా ఫెయిల్యూర్‌ని ఎలాగైనా మరిపించాలని కంకణం కట్టుకున్నారు బుచ్చిబాబు సానా.

ఆల్రెడీ పెద్ది కోసం రెహమాన్ రెండు పాటలను కూడా కంపోజ్ చేశారు. 2025లో పెద్దిని సక్సెస్ చేసి చూపిస్తామంటున్నారు ఫ్యాన్స్.