నువ్వేమైనా చేయ్.. అవసరమైతే చచ్చిపో.. సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తే చాలు అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ. గతంలో ఎన్నోసార్లు ఇదే చేసారు.. ఇప్పుడు వ్యూహం కోసం ఇదే చేస్తున్నారు ఆర్జీవీ. మరి వర్మ వ్యూహాలు వర్కవుట్ అవుతాయా..? సెన్సార్ చిక్కుల నుంచి బయపడుతుందా..? రాజకీయ పద్మవ్యూహంలో వర్మ వ్యూహం ఇరుక్కుపోతుందా లేదంటే టైమ్‌కు వస్తుందా..?
సాధారణంగా ఏ దర్శకుడైనా తమ సినిమా చిక్కుల్లో పడితే టెన్షన్ పడతారు. అలాంటి లక్షణాలు ఒక్కటి కూడా లేకుండానే ఈయన పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు RGV. ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తారీయన. తాజాగా వ్యూహం విషయంలోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు వర్మ.
వ్యూహం సినిమా అనౌన్స్ చేసినపుడే వర్మకు తెలుసు.. రిలీజ్ టైమ్‌లో కచ్చితంగా కాంట్రవర్సీ అవుతుందని..! అదే ప్రమోషన్‌కు హెల్ప్ అవుతుందని..! అనుకున్నట్లే జరిగింది.
సెన్సార్ దగ్గర వ్యూహం పప్పులుడకలేదు. దాంతో రివైజింగ్ కమిటీకి వెళ్లారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్. అక్కడితో ఆగకుండా.. వ్యూహం కోసం పుష్ప సినిమాను వాడుకుంటున్నారు వర్మ.
చూస్తున్నారుగా.. పుష్పలో బన్నీ డైలాగ్‌ను తన సినిమా కోసం వర్మ ఎలా వాడేసారో..? నవంబర్ 10న ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. అయితే సెన్సార్ చిక్కుల్ని దాటుకుని వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. పాత్రల పేర్లు, సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ చేయలేదు సభ్యులు. మొత్తానికి చూడాలిక.. వర్మ వ్యూహం ఎలా ఉండబోతుందో..?