మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా మారనున్నారు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరు సుమారు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తన ప్రెగ్నెన్సీపై ఆసక్తికర విషయాలను పంచుకుంది. లేట్ ప్రెగ్నెన్సీకి కారణేమేంటో, దీని కారణంగా సమాజం నుంచి తనకు ఎలాంటి ఒత్తిడి ఎదురైందో అందరితో షేర్ చేసుకుంది.
'సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నేను అమ్మను కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చినందుకు ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉంది. వివాహమైన పదేళ్ల తర్వాత మేం బిడ్డలను కనాలని అనుకున్నాం. ఎందుకంటే ఇది సరైన సమయం అనిపించింది'
'రామ్ చరణ్, నేను మా రంగాల్లో ఎదిగాం. ఆర్థికంగా బలోపేతమయ్యాం. మా పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి చేరాం. ఇది మా ఇద్దరి నిర్ణయం. ఈ విషయంలో అటు సమాజం, ఇటు కుటుంబం, బంధువుల ఒత్తిడికి తలొగ్గలేదు' అని చెప్పుకొచ్చింది ఉపాసన.
ఇది తమ మధ్య ఉన్న బలమైన బంధాన్ని చెప్పడంతో పాటు, పిల్లల విషయంలో తమకున్న స్పష్టతకు నిదర్శనమన్నారు మెగా కోడలు.