ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు..టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోస్ అని తెలుసా?

Updated on: Feb 16, 2025 | 5:26 PM

స్టార్ హీరోల పిల్లల చిన్ననాటి ఫోటోస్ చూస్తూ అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా ఆ హీరో పిల్లాడే నేటి పాన్ ఇండియా స్టార్ హీరో అయితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అయితే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోస్ అంటూ ఓ పిక్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. కాగా, ఆ ఫోటోలో ఉన్నవారెవరో మరి మీరు కూడా గుర్తు పట్టండి.

1 / 5
చిరుత సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన మెగాస్టార్ చిరు ముద్దుల కుమారుడు రామ్ చరణ్, అలాగే మెగా సీనియర్ హీరో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో వరుణ్ తేజ్‌ను రామ్ చరణ్‌ ఎంతో ప్రేమగా ఎత్తుకున్నాడు.

2 / 5
వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెర్రీతో తనకున్న బాండింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చెర్రీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తాను తనను ఎత్తుకొని, ఆడించేవాడని, కానీ కాస్త పెద్ద అయ్యాక, మా ఇద్దరి మధ్య ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు ఉండేవంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

3 / 5
అంతే కాకుండా, చిన్నప్పుడు నేను మెగాస్టార్ చిరంజీవికి సపోర్ట్ చేస్తే, చరణ్ మాత్రం పవన్ కళ్యాణ్ బాబాయ్‌కు సపోర్టు చేసేవాడు. మేమిద్దరం మా యాడ్ బాగుందంటే, మా యాడ్ బాగుందంటూ గొడవపడేవాళ్లం.

4 / 5
చిరంజీవి ఇంట్లో ఉన్నంత సేపు నేను చాలా ఏంజాయ్ చేసేవాడిని చరణ్‌తో... మెగాస్టార్ లేకుంటే పవన్, చరణ్ బాగా ఆడుకునే వారని  చెప్పుకొచ్చారు.

5 / 5
ఇక తాజా ఫొటోలో రెడ్ కలర్ టీషర్ట్‌లో వరుణ్ తేజ్ చిన్న స్మైల్ ఇస్తూ కనిపించగా, చరణ్ బ్లూకలర్ టీ షర్ట్‌లో నవ్వుతూ కనిపించాడు. ఇక ఈ ఫొటోను చూసిన అభిమానులు మెగా హీరోల అనుబంధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.