
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ముంచుకోస్తోంది. ఈనెల 22న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా రానున్నారు.

సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఇప్పటికే అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రజనీకాంత్, చిరంజీవి, పవన్ కల్యాణ్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, ధనుష్.. తదితరులకు ఆహ్వానాలు అందాయి.

3. తాజాగా రామ్ చరణ్- ఉపాసన దంపతులకు అయోధ్య ఆహ్వానం అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేడ్కర్ హైదరాబాద్‌లోని రామ్‌చరణ్ నివాసానికి వెళ్లి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ఈసారి రామ్ చరణ్ దంపతులు బెంగుళూరులో సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి తమ కుమార్తె క్లింకారాతో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయారు రామ్ చరణ్ దంపతులు.

రామ్ చరణ్ దంపతుల వెంట వారికి ఇష్టమైన పెట్ డాగ్ కూడా ఉంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నాడు