
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్‌లో ఇండస్ట్రీ లో మొన్నటి వరకు దుమ్ములేపింది. సక్సెస్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ అందరిని ఎంటర్‌టైన్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ మొదట తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల తో నటించింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ ఆఫర్లు దక్కించుకుని అక్కడ బిజీ అయ్యింది.

బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక అందాల ఆరబోతలో మరింత డోస్ పెంచింది. గతేడాది ఆమె సినిమాలన్నీ బ్యాక్ టూ బ్యాక్ విడుదల అవ్వగా వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొని హాట్ ట్రీట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఈమెకు అవకాశాలు తగ్గాయి అని తెలుస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుకి దూరమైంది అనే చెప్పాలి. ఆమె చివరగా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ రూపొందించిన `కొండపొలం` చిత్రంలో నటించింది. ఈ సినిమాకిలో `ధమ్ ధమ్ ధమ్` పాటకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.

`కొండపొలం` తర్వాత బాలీవుడ్‌కి సినిమాలు చేస్తూ తెలుగులో సినిమాలు తగ్గించింది. టాలీవుడ్ మేకర్స్ కూడా రకుల్ ను లైట్ తీసుకుంటున్నారు. అయితే హిందీలో `దే దే ప్యార్ దే` చిత్రం తర్వాత నుండి అక్కడ వరుసగా ఆఫర్లని అందుకుంది. వచ్చిన ప్రతి ఛాన్స్ ను మిస్ చేసుకోకుండా అన్ని చిత్రాల్లో నటించింది.

ఈ ఏడాది బాలీవుడ్ లో `ఛత్రివాలి`, `బూ`, `ఐ లవ్ యూ` చిత్రాలు చేయగా అవి నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు `మేరీ పత్ని కా రీమేక్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `అయలాన్` చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. రకుల్ తమిళంలో `ఇండియన్ 2`లో నటిస్తుంది.