
సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య- తరుణ్ కార్తికేయన్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది. సోమవారం (ఏప్రిల్ 15)న జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శంకర్ కూతురు ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఓ లైంగిక వేధింపుల కేసులో దామోదరన్ కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి.

దీంతో రోహిత్ తో ఐశ్వర్య తెగదెంపులు చేసుకుంది. ఇప్పుడు కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీ కేయన్ తో కలిసి పెళ్లిపీటలెక్కిందామె.

ఈ వివాహ వేడుకకు రజనీకాంత్, కమల హాసన్, సూర్య, కార్తీ, చియాన్ విక్రమ్, సుహాసిని, మణిరత్నం తదితర సినీ ప్రముఖులు, టెక్నీ షియన్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను అశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు సినీ ప్రమఖులు. ప్రస్తుతం ఐశ్వర్య- తరుణ్ ల పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.