
చాలా రోజులు తరువాత తలైవా మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా జైలర్. సరైన సినిమా పడితే రజనీ అభిమానులు జోరు ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ మూవీ ప్రూవ్ చేసింది. అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా సీక్వెల్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

రీసెంట్ టైమ్స్‌లో రజనీ నుంచి వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు సో సోగానే ఆడాయి. అందుకే జైలర్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది తలైవా ఆర్మీ. మోస్ట్ అవెయిటెడ్ హిట్ కావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో రజనీ నుంచి వచ్చిన పేట, దర్బార్, అన్నాత్తే సినిమాలు సో సోగానే ఆడాయి. అందుకే జైలర్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది తలైవా ఆర్మీ. మోస్ట్ అవెయిటెడ్ హిట్ కావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

సూపర్ స్టార్‌ను వయసుకు తగ్గ పాత్రలో చూపిస్తూనే ఆయన ఇమేజ్‌ను కూడా పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. అందుకే జైలర్ ఆడియన్స్‌కు అంత బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. చాలా రోజుల కిందటే నటి మిర్నా సీక్వెల్ న్యూస్‌ను కన్ఫార్మ్ చేశారు.

తాజాగా యూనిట్ సైడ్ నుంచి మరింత క్లారిటీ వస్తోంది. సీక్వెల్‌ను జైలర్ 2 పేరుతో కాకుండా హుకుం పేరుతో ప్లాన్ చేస్తున్నారట నెల్సన్. అంతేకాదు పార్ట్ 2ను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డిజైన్ చేస్తున్నారు.

ఆల్రెడీ కథ కూడా లాక్ చేసిన నెల్సన్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారు. ప్రజెంట్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయాన్ సినిమా చేస్తున్న తలైవా, నెక్ట్స్ లోకేష్ మూవీలో నటిస్తారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత హుకుంను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.