
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం బిగ్ నెంబర్స్‌ను టచ్ చేసింది. 12 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సినిమాల సరసన నిలిచింది.

కోలీవుడ్‌లో ఇప్పటి వరకు 2.ఓ, పొన్నియిన్ సెల్వన్ 1, జైలర్, లియో సినిమాలు మాత్రమే 500 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. ఇప్పడు ఈ సినిమాల సరసన కూలీ కూడా చేరింది. అయితే బిజినెస్ పరంగా చూస్తే కూలీ విషయంలో 500 కోట్లు కూడా పెద్ద నెంబరేం కాదన్న టాక్ వినిపిస్తోంది.

రజనీ, లోకేష్ కాంబో మీద ఉన్న హైప్, భారీ మల్టీస్టారర్ కావటంతో ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఆడియన్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లోకి కూడా అతి కష్టం మీద ఎంటర్ అయ్యింది.

గతంలో 2.ఓ విషయంలోనూ ఇదే జరిగింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా పూర్తిస్థాయిలో బడ్జెట్‌తో రికవర్ చేయలేకపోయింది. కూలీ విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి. 1000 కోట్ల అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా రన్ 500 కోట్ల తరువాత ఆగిపోయింది.

దీంతో రజనీ మార్కెట్ మీద అనుమానాలు మొదలవుతున్నాయి. అప్ కమింగ్ సినిమాల విషయంలో రజనీ స్టామినా మీద నమ్మకంతో కాకుండా.. కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేస్తే బెటర్ అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి.