వరుస ఫ్లాప్‌ల తరువాత జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. అందుకే తన నెక్ట్స్ సినిమాల్లో కూడా ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు తలైవా.
జైలర్ సక్సెస్‌లో రజనీకాంత్ స్టైల్, యాక్షన్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌ల గెస్ట్ అపియరెన్స్ కూడా కీ రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా మాలీవుడ్, సాండల్‌వుడ్‌లలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించడానికి హెల్ప్ అయ్యాయి ఈ గెస్ట్ రోల్స్. అందుకే అప్ కమింగ్ సినిమాల్లోనూ ఇతర భాషల స్టార్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు తలైవా.
జైలర్ తరువాత టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ఆల్రెడీ ప్రారంభమైన ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో పాటు మాలీవుడ్ నుంచి ఫాహద్ ఫాజిల్, టాలీవుడ్ నుంచి రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా రజనీకి పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ అంటున్నారు తమిళ జనాలు.
లోకేష్ సినిమా విషయంలోనూ మల్టీ స్టారర్ ఫార్ములానే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారట రజనీకాంత్. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. రజనీతో మూవీ అంటే పృథ్వీరాజ్ కూడా నో అనే ఛాన్స్ లేదు కాబట్టి ఈ కాంబో ఆల్మోస్ట్ సెట్ అయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది.
ఇతర భాషల్లో పృథ్వీరాజ్ గెస్ట్ రోల్స్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు సాధించాయి. అందుకే సెంటిమెంట్ పరంగా కూడా ఈ మలయాళ నటుడి ప్రజెన్స్ సినిమాకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.