సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమా విజయోత్సాహంలో ఉన్నారు. సుమారు మూడు వారాల క్రితం రిలీజైన ఈ సినిమా ఇప్పటికే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటివరకు సుమారు రూ. 600 కోట్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
కాగా సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్నా ఎంతో సింపుల్‌గా ఉంటారు రజనీకాంత్. ఎక్కడికెళ్లినా ఓ సామాన్యుడిలా కనిపిస్తుంటారు. తాజాగా మరోసారి తన సింప్లిసీటీని చాటుకున్నారు తలైవా. తాజాగా గతంలో తాను బస్ కండక్టర్‌గా పనిచేసిన బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోలో సందడి చేశారు రజనీకాంత్. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చిన రాకను చూసి అక్కడి ఉద్యోగులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.
జయనగర్ బీఎంటీసీ డిపోకు ఉదయం 11:30 గంటలకు రజనీకాంత్ వచ్చారు. 11:45 వరకు డిపోలోనే ఉన్నారు. సమారు 15 నిమిషాల పాటు అక్కడున్న సిబ్బందితో మాట్లాడి వారి బాగోగుల గురించి ఆరా తీశారు రజని.
కొద్దిసేపు సిబ్బందితో మాట్లాడిన రజనీకాంత్ ఆ తర్వాత డిపో లోపలే కలియ తిరిగారు. ఈ సందర్భంగా తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతర బస్ డిపో సిబ్బంది రజనీతో సెల్ఫీలు దిగారు.
కాకాగా హీరో కాకముందు రజనీ బీఎంటీసీ కండక్టర్‌గా పనిచేశారు. జయనగర్ డిపోలో పనిచేశారు. అందుకే ఇక్కడికి వచ్చారు. రజనీ మిత్రులు రాజ్ బహదూర్‌తో పాటు బస్ డిపో దగ్గరకు వచ్చారు. ప్రస్తుతం రజనీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.