
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. జాతర నేపథ్యంలో వచ్చే ఓ పాటను భారీగా చిత్రీకరిస్తున్నారు. అదే సెట్‌లో మరో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా రూపొందించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

భారతీయుడు టీమ్ మేకింగ్ స్పీడు పెంచింది. త్వరలో విజయవాడలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఓ థియేటర్‌లో నాలుగు రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ఆ తరువాత వైజాగ్‌లోనూ షూటింగ్ చేసేందుకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ లాంటి దేశాలకు వెళ్లొచ్చిన సామ్, ప్రస్తుతం భూటాన్‌లో ఉన్నారు. అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్‌కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు సమంత.

మంచు విష్ఱు లీడ్ రోల్‌లో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను న్యూజిలాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. మేజర్ పార్ట్ అక్కడే షూట్ చేసేలా ప్లాన్ చేశారు. ఇలాంటి సినిమాకు న్యూజిలాండ్ వాతావరణమే సరైంది అన్నారు విష్ణు.

వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది సింగం ఎగైన్ టీమ్. ఇప్పటికే హీరో అజయ్ దేవగన్‌తో పాటు అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపిక పదుకోన్ లుక్ రివీల్ చేసిన టీమ్ తాజాగా కరీనా కపూర్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది. చేతిలో తుపాకితో యాక్షన్ మోడ్‌లో ఉన్న కరీనా లుక్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.