
ఇప్పుడు మన నిర్మాతలకు ఈ పాట బాగా సూట్ అవుతుందేమో..? ఎందుకంటే OTTని నిజంగానే రాంగ్ యూజేస్ చేస్తున్నారిప్పుడు. రెండు వారాలు కూడా కాకుండానే డిజిటల్‌లో విడుదల చేస్తూ ఆడియన్స్‌కు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. నెల లోపే సినిమా వచ్చేస్తుందిలే అని ప్రేక్షకులు కూడా కాలు బయటికి పెట్టడం లేదు.

సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే ముందు సైంధవ్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దాంతో అనుకున్న దానికంటే ముందుగానే ఈ చిత్రాన్ని ఓటిటికి ఇస్తున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి సైంధవ్ డిజిటల్‌లోకి అందుబాటులోకి రానుంది. మొన్న కళ్యాణ్ రామ్ డెవిల్, దానికి ముందు రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా 2, 3 వారాలకే ఓటిటికి వచ్చాయి.

సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. ఎర్లీ విండో పేరుతో అగ్రిమెంట్ కంటే ముందుగానే ఓటిటికి ఇస్తున్నారు నిర్మాతలు. దాంతో ఆడియన్స్ వాటిని థియేటర్లలో చూడాలనుకున్నా.. వద్దులే రెండు వారాలకే ఇంటికి వచ్చేస్తుందని ఆగిపోతున్నారు.

యావరేజ్ టాక్ వచ్చినపుడు బతికించే ప్రయత్నం చేయకుండా.. ఓటిటి పేరుతో నిర్మాతలే చంపేస్తున్నారనే విమర్శలు ఎక్కువైపోతున్నాయిప్పుడు. ఇలా అయితే సినిమాల ఫ్యూచర్ ఏమవుతుందో.?