
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఫ్యామిలీ కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకొంది.

న్యూఇయర్ సందర్భంగా దిల్ రాజు ఫ్యామిలీ వెళ్లింది. అక్కడే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దిల్ రాజు వెంట ఆయన భార్య తేజస్విని, కుమారుడు కూడా ఉన్నారు.

దుబాయ్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను తేజస్విని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో చనిపోయింది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2020లో తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2022లో ఈ దంపతులకు అన్వి రెడ్డి అనే కుమారుడు జన్మించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన అనే సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజ్.

రవికిరణ్ కోలా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మూవీ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ కాగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.