Phani CH |
Oct 08, 2022 | 4:52 PM
ఒరు అదార్ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.
తొలి సినిమానే సెన్సేషన్ కావటంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి.
తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగులో చెక్, ఇష్క్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు మేకర్స్. కానీ ఈ రెండు సినిమాలు ఫెయిల్ కావటంతో అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి.
స్పెషల్ సాంగ్‌లో గ్లామర్ యాంగిల్ చూపించినా.. పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
బాలీవుడ్ అవకాశం కూడా ప్రియా ప్రకాష్‌కి పెద్దగా కలిసి రాలేదు. శ్రీదేవి బంగ్లా పేరుతో ప్రియా ప్రకాష్ నటించిన సినిమా దాదాపు మూడేళ్లుగా రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్‌లో ఉంది.
ఈ సినిమాలో శ్రీదేవి మరణాన్ని తప్పుగా చూపించారన్న విమర్శలు రావటంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
బిగ్ స్క్రీన్ మీద కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సోషల్ మీడియాలో స్పీడు పెంచారు వింక్ బ్యూటీ. వెకేషన్ టైమ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో జోరు చూపిస్తున్నారు.
ఈ జోష్ సిల్వర్ స్క్రీన్ మీద అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.