Movies : విడుదలకు ముందే వివాదాలను ఎదుర్కొన్న సినిమాలు ఇవే..
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన గంగూబాయ్ కతియావాడీ సినిమా పై రోజుకొక వివాదం పుట్టుకొస్తుంది. తాజాగా ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనున్న
Movies
Follow us on
‘గంగూబాయ్ కతియావాడీ’ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా పై గంగూబాయ్ కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో తన తల్లిని వేశ్యగా చూపించారని ఆరోపిస్తూ గంగూబాయ్ దత్తపుత్రుడు రావుజీ షా కోర్టుకెక్కారు.
2021, డిసెంబర్… టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ ‘83’ మూవీ పై కూడా వివాదం తలెత్తింది. ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది.
2020 అక్టోబర్… శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ పై తమిళనాడులో వివాదం రేగింది. చివరికి ఈ సినిమా నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు.
గతంలో వచ్చిన దేవినేని, వంగవీటి బయోపిక్‌లపై ఆంధ్రప్రదేశ్‌లో వివాదాలు చెలరేగాయి తమ అనుమతి లేకుండా సినిమాను తెరకెక్కించడంపై వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు
ఇక 2019… నందమూరి బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నాదెండ్ల భాస్కరరావు పాత్ర విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సినిమాలో తన పాత్రను కూడా విలన్‌గా చూపిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేశారు.
అలాగే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం. ఈ చిత్ర కథపై కూడా వివాదం రేగింది. పన్నులు వసూళ్ల పేరుతో ప్రజలను చిత్రహింసలు పెట్టిన పాలెగాడు నరసింహారెడ్డి అని, కేవలం తమకు దక్కాల్సిన భరణాల విషయంపైనే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు కాజాలడని వాదించారు కొంతమంది.
2018.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లో వెన్నుపోటు పాట తో ఆర్జీవి వివాదాస్పదం అయ్యింది. చంద్రబాబుని విలన్‌గా చూపించారని.. ఆ పాట పై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యారు.