Rajeev Rayala |
Aug 26, 2022 | 6:08 PM
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ఏడాదే రణ్‌బీర్ కపూర్ ను అలియా భట్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ వెంటనే అలియా ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ ను కూడా అభిమానులతో పంచుకుంది.
అయితే మొన్నటివరకు ఆమె వైద్యుల సలహా మేరకు షూటింగ్స్ లో పాల్గొంటూ వచ్చింది.
కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలాయాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా అలియా భట్ బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మొదటి సారి అలియా బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. అలియా ఫోటోలపై నెటిజన్లు ఆల్ ది బెస్ట్, సూపర్, విల్ బి ఎ గ్రేట్ మామ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.