Dragon: సముద్రం బ్యాక్ డ్రాప్ కథతో NTR సినిమా

|

Mar 05, 2025 | 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా..? అది ఇంటర్నేషనల్.. అంతా ఇంతా కాదు అంటూ హైప్‌తోనే చంపేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. అది తెలిసి డబుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్. మరి అదేంటి..? డ్రాగన్ ముచ్చట్లన్నీ ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

1 / 5
ట్రిపుల్ ఆర్ హిట్టైనపుడు కాదు కానీ.. దేవర ఆడినపుడే జూనియర్ ఎన్టీఆర్ అసలు స్టామినా ఏంటో అందరికీ తెలిసింది. ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ ఎలాంటి టాక్ వచ్చిందో చెప్పనక్కర్లేదు.

2 / 5
అయినా కూడా తన మాస్ ఇమేజ్‌తో నిలబెట్టడం కాదు.. బ్లాక్‌బస్టర్ కొట్టి చూపించారు తారక్. పైగా రాజమౌళి తర్వాత సినిమా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసారు. దేవర అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సముద్రమే.. అందులో సీ బ్యాక్ డ్రాప్ అంతగా వాడుకున్నారు కొరటాల శివ.

3 / 5
ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు తారక్. హృతిక్ రోషన్‌తో కలిసి ఇందులో నటిస్తున్నారు ఎన్టీఆర్. వార్ 2లోనూ సముద్రంలో కొన్ని యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తుంది. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారు జూనియర్ ఎన్టీఆర్.

4 / 5
ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా గురించి తాజాగా అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చారు మైత్రి రవిశంకర్. డ్రాగన్ రేంజ్ ఇంటర్నేషనల్ అంటూ ఫ్యాన్స్‌ను ఊరించారాయన. హై ఓల్టేజ్ యాక్షన్‌ఎంటర్‌‌గా డ్రాగన్ తెరకెక్కుతుందన్నారు రవి.

5 / 5
1960స్ నేపథ్యంలో గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలవబడే సముద్రతీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా బేస్డ్‌గా డ్రాగన్ తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ లెక్కన ఇందులోనూ సముద్రమే స్పెషల్ అట్రాక్షన్. దేవర తర్వాత తారక్ ఎంచుకుంటున్న కథల్లో తెలియకుండానే సముద్రం వచ్చేస్తుంది. సెంటిమెంట్ కూడా రిపీట్ అయితే.. సినిమా సెన్సేషన్ అవుతుందేమో..?