Prasanth Varma: మరో సినిమా సెట్స్‌లో ప్రశాంత్.. మరి జై హనుమాన్ పరిస్థితేంటి..?

| Edited By: Prudvi Battula

Mar 24, 2024 | 8:09 AM

జై హనుమాన్‌ను ప్రశాంత్ వర్మ పక్కనబెట్టారా లేదంటే ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారా..? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు.. దానికి కారణం కూడా ఆయనే. జై హనుమాన్ వర్క్ మొదలైందని మొన్నే చెప్పిన ఈ దర్శకుడు.. అంతలోనే మరో సినిమా సెట్స్‌లో దర్శనమిచ్చారు. మరి జై హనుమాన్ పరిస్థితేంటి..? అదెప్పుడు రానుంది..? ప్రశాంత్ వర్మ ఇప్పుడేం చేస్తున్నారు..?

1 / 5
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కెరీర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. అదేంటి అలా అంటున్నారు అనుకోవచ్చు కానీ ఇదే జరుగుతుందిప్పుడు. 300 కోట్ల విజయం ఖాతాలో వేసుకున్నా.. ఈ దర్శకుడికి కంగారైతే తప్పట్లేదు.

2 / 5
జై హనుమాన్ చేయాలంటే స్టార్ హీరో ఖాళీగా ఉండాలి కానీ ఎవరూ లేరిప్పుడు. అందుకే వేరే సినిమాలతో బిజీ అయిపోయారు ఈ సంచలన దర్శకుడు. తేజా సజ్జాతో చేసిన హనుమాన్ కోసమే మూడేళ్లు తీసుకున్న ప్రశాంత్ వర్మ.

3 / 5
స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న జై హనుమాన్ ఒక్క ఏడాదిలో అయితే పూర్తి చేయడం కష్టమే. అందుకే 2025 సంక్రాంతికి జై హనుమాన్ రాకపోవచ్చు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలైందని చెప్పుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్.

4 / 5
ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈయన అనుపమ పరమేశ్వరన్‌తో ఆక్టోపస్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనా.. దానికి టైమ్ పడుతుందని యంగ్ హీరో తేజ సజ్జా కూడా చెప్పారు. 

5 / 5
అందుకే హనుమాన్ సీక్వెల్‌ని హోల్డ్‌లో పెట్టి.. ఆక్టోపస్‌తో పాటు అధీర అనే మరో సినిమా చేస్తున్నారు. ఇది కూడా సూపర్ హీరో సినిమానే. డివివి దానయ్య కుమారుడు ఇందులో హీరో. మొత్తానికి జై హనుమాన్ ఉన్నా.. ఇప్పట్లో లేదు. దానికి ముందే మరో రెండు సినిమాలు రానున్నాయన్నమాట.