
మోడలింగ్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆపై చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రగ్యా నయన్. నిజానికి ఈ బ్యూటీ విప్రోలో కొంత కాలం జాబ్ కూడా చేసిందట. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో జాబ్ వదిలేసి, సినిమా రంగంలోకి వచ్చేసింది.

2018లో వచ్చిన ‘ఎస్కేప్’ అనే కన్నడ సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించింది ప్రగ్యా నయన్. ఆ తర్వాత తెలుగులో ‘సురాపానం’,‘సమరం’, ‘ఇన్‌సెక్యూర్’ తదితర చిత్రాల్లో నటించింది. కానీ, ఆ సినిమాలేవీ సక్సెస్ సాధించలేక పోయాయి.

దాంతో పెద్దగా లైమ్‌లోకి రాలేకపోయింది. మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే ఘాటు ఫోటోలు కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. తాజాగా ఈ బ్యూటీ తను నటిస్తున్న కళింగ ప్రమోషన్‌లలో భాగంగా ఘాటైన ఫోటోలు పంచుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. సెప్టెంబర్‌లో రిలీజవుతున్న క్రేజీ సినిమాల్లో కళింగ ఒకటి. హార్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ధృవవాయిు దర్శకత్వం వహించాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే… హీరో కూడా ఆయనే.

ఇప్పటికే రిలీజైన టీజర్ ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమాలతోపాటు పలు మ్యూజిక్ వీడియోలు, షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ మెరిసింది ప్రగ్యా.