
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. చాలా కాలం తరువాత ప్రభాస్ చేస్తున్న కామెడీ మూవీ కావటం, అది కూడా హారర్ కామెడీ కావటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే ఈ మూవీ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ది రాజాసాబ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. డిసెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని ఎనౌన్స్ చేసింది.

అయితే ఈ డేట్ విషయంలోనూ చర్చ జరుగుతోంది.లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న ఇండియన్ సినిమా రికార్డ్‌లు తిరగరాసిన పుష్ప 2 రిలీజ్ అయ్యింది. పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు డిసెంబర్ ఫస్ట్ వీక్ మీద పెద్దగా బజ్ ఉండేది కాదు.

హాలీడే సీజన్ కాకపోవటంతో ఆ డేట్స్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ పుష్ప 2 రిలీజ్ తరువాత అన్ని లెక్కలు మారిపోయాయి. ది రాజాసాబ్ కూడా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

మరోసారి పుష్ప 2 రికార్డ్స్ రిపీట్ అవ్వటం ఖాయం అని భావిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు.