ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్- కే నుంచి కీలక అప్డేట్ వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.
అమెరికాలో జరుగుతోన్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ వేదికగా ప్రాజెక్టు కే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్, కమల్ హాసన్, రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'చెర్రీ నాకు మంచి ఫ్రెండ్. ఏదో ఒకరోజు మేమిద్దరం కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం' అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
Pదీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అటు డార్లింగ్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, చెర్రీల కాంబినేషన్‌లో సినిమా వస్తే టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్.
ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ కే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుందనే ఊహాగానాలు ఉన్నాయి.