మా నాన్న మీద గౌరవంతో కన్నప్పలో నటించినందుకు ప్రభాస్ డబ్బులు తీసుకోలేదు. ఆ మాట ఎత్తితే ఊరుకోనన్నారంటూ విష్ణు చెప్పిన మాటలను రిపీటెడ్‌గా వైరల్ చేసుకుంటున్నారు అభిమానులు.
కన్నప్ప రిలీజ్ అయితే డార్లింగ్‌ని ఒక్కసారి చూసుకోవచ్చని అనుకుంటున్నారు. అంతే కాదు.. బాహుబలి రూపంలో వారికో స్వీట్ సర్‌ప్రైజ్ ఉందన్నది ఇండస్ట్రీ మాట.కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపారు.. ఇది సెకండ్ పార్టుకి యూఎస్‌పీ అయితే అవ్వొచ్చేమోగానీ.. అంతకు మించిన మేజిక్ ఏదో ఉంది పార్ట్ ఒన్‌లో అంటూ మాట్లాడుకుంటుంటారు ఫ్యాన్స్.
ఇప్పుడు ఆ మాటల జోరు పెరిగింది. ఫస్ట్ బాహుబలి రిలీజ్ అయిన డేట్‌కే రీ రిలీజ్ ఉండే అవకాశాలున్నాయన్నది ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్. రీ రిలీజ్ ఫీవర్ నుంచి కాస్త బయటపడ్డాక రాజా సాబ్‌ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఆగస్టు మధ్యలో ది రాజాసాబ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. మారుతి కెరీర్‌లో నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంటుందట రాజా సాబ్ ప్రభాస్‌తో కలిసి పని చేసిన రోజుల్ని అసలు మర్చిపోలేనని అంటున్నారు సప్తగిరి.
రాజాసాబ్ గురించి ఈ మధ్య ఆయన చెప్పిన మాటలు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకోవడం ఖాయమన్నది ఆయన మాటల్లో వినిపించిన మీనింగ్. వీటన్నిటినీ విన్న ఫ్యాన్స్... ఈ ఇయర్‌కి ఈ అప్‌డేట్స్ సరిపోతాయంటూ ఖుషీ అవుతున్నారు.