
గుంటూరు కారం మూవీ నుంచి థర్డ్ సింగిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కుర్చి మడతెట్టి అంటూ సాగే మాస్ నెంబర్ ప్రోమోను రిలీజ్ చేశారు. మహేష్, శ్రీలీల మీద చిత్రీకరించిన ఈ పాటకు తమన్ సంగీతమందించారు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫైనల్‌గా ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి కానుకగా డార్లింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. హరర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది హనుమాన్ టీమ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీమ్‌ను యంగ్ హీరో అడివి శేష్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటించారు.

సౌత్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న త్రిష కృష్ణన్, బాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా ఈ రోజు ప్రారంభమైన ది బుల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు త్రిష. తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ రూపొందిస్తున్న ఈ సినిమాను ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

హన్సిక లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఎక్స్‌పరిమెంటల్ మూవీ 105 మినిట్స్. కేవలం ఒకే ఒక్క పాత్రతో, ఒకే షాట్‌లో ఈ సినిమాను రూపొందించారు. 105 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది 105 మినిట్స్. రాజు దుస్స దర్శకుడు.