కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా లేదా..? చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న ఇది. నాగ్ అశ్విన్‌ను ఇదే అడిగితే చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇప్పుడు సినిమా విడుదలైపోయింది.. సస్పెన్స్‌కు తెరపడింది.
అందుకే కల్కిలో చాలా వరకు ప్రశ్నల్ని అలాగే వదిలేసారు నాగ్ అశ్విన్. వాటికి ఆన్సర్స్ తన యూనివర్స్‌లో చెప్పబోతున్నారు. కల్కి 2898 ఏడికే 600 కోట్లు బడ్జెట్ పెట్టించారు నాగ్ అశ్విన్.
అలాంటిది దీనికి యూనివర్స్ అంటే వేల కోట్ల బడ్జెట్ కావాలి.. కానీ ఆయన విజన్ చూసిన తర్వాత నిర్మాతలకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయనడంలో డౌట్ లేదు. మొత్తానికి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్‌లతో పాటు ఇప్పుడు నాగ్ అశ్విన్ యూనివర్స్ రెడీ అవుతుంది.
తొలి రోజు రికార్డ్ స్థాయిలో ఐదున్నర లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. వసూళ్ల పరంగానూ ప్రీ బుకింగ్స్‌లోనే 16 కోట్ల మార్క్‌ను టచ్ చేసిందని అంచనా వేస్తున్నారు ట్రెడ్ ఎనలిస్ట్‌లు. యూఎస్‌లో కల్కి క్రేజ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది.
మరి కల్కి సినిమాకు సీక్వెల్ ఉందా..? ఉంటే పార్ట్ 2 ఎప్పుడు.. లేదంటే నాగ్ అశ్విన్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా..? కేవలం తెలుగులోనే కాదు.. ఇండియన్ వైడ్‌గా ఇప్పుడు కల్కి మేనియా నడుస్తుంది. 600 కోట్లతో అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైంది.
అంటే కల్కిలో ఉండే పాత్రలతో సినిమాలు వస్తూనే ఉంటాయన్నమాట. అది కృష్ణుడు కావచ్చు.. కర్ణుడు కావచ్చు.. అర్జునుడే అవ్వొచ్చు. కల్కి పార్ట్ 2 ఉంటుందని ముందు నుంచి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఇంత పెద్ద కథను కేవలం రెండు మూడు భాగాల్లో చెప్పలేమని నాగ్ అశ్విన్ కూడా ఫీల్ అయ్యారేమో మరి..? అందుకే కల్కి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు ఈ కుర్ర దర్శకుడు.