
పాన్ ఇండియా ఇమేజ్‌ను మెయిన్‌టైన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అదే రేంజ్ లైనప్ ఉండాలి.. ఆ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవ్వాలి. గ్యాప్ లేకుండా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుండాలి. ఈ విషయంలోనే టాలీవుడ్ స్టార్స్ మధ్య కంపారిజన్ కనిపిస్తోంది. డార్లింగ్ జెట్ స్పీడుతో దూసుకుపోతుంటే..?

మిగతా హీరోలు మాత్రం ఆ స్పీడును చేయలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్‌కు కాస్త టైమ్ తీసుకున్న ప్రభాస్, ఆ తరువాత మాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస రిలీజ్‌లతో హల్ చల్ చేస్తున్నారు.

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ట్రిపులార్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కాస్త వెనుకపడ్డారు.

ట్రిపులార్ కోసం మూడేళ్లు పాటు షూటింగ్ చేశారు ఎన్టీఆర్. అంటే 2018లో రిలీజ్ అయిన అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ ఒక్క ట్రిపులార్‌లో మాత్రమే కనిపించారు. ఆ సినిమా వచ్చి కూడా రెండేళ్లు దాటిపోయింది.

దీంతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసిన చరణ్, ట్రిపులార్ కోసం మూడేళ్లు కేటాయించారు. దీంతో కెరీర్‌లో లాంగ్ బ్రేక్ వచ్చింది.ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసినా.. ఆ సినిమా కూడా మూడేళ్లుగా సెట్స్ మీదే ఉంది.

ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉంటే.. సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న చరణ్, తారక్ చేతిలో మాత్రం చెరో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.

అందుకే ఈ ఇద్దరు కూడా డార్లింగ్ రేంజ్ స్పీడు చూపిస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్.